తమ ఉపాధ్యాయులు మరింత ఉత్సాహంతో బోధించాలి
09-09-2026 | 08:58pm
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కౌట(బి) గ్రామ ఉన్నత పాఠశాల(Kauta(B) Village High School)లో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు శశిధర్ రెడ్డి సహా ఉపాధ్యాయులు శ్రీరామ్ లు ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వివేకానంద యూత్ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులకు(Students) నాణ్యమైన విద్యను అందిస్తూ మరింత ఉత్సాహంతో పని చేయాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకోవడం తమ గ్రామానికి హర్షించదగ్గ విషయమని యూత్ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంజయ్య గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ పి అశోక్ రెడ్డి రమణ గౌడ్ ఇత్తడి రాజు యూత్ సభ్యులు ప్రశాంత్ సాబీర్, ప్రవీణ్, పృథ్వి, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.