తుమ్మల ప్రసూన రెడ్డి జ్ఞాపకార్థం వాటర్ ప్లాంట్ ఏర్పాటు
సొంత నిధులతో గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించిన తుమ్మల కీర్తి వర్ధన్ రెడ్డి
ఆలేరు,(విజయక్రాంతి): తుమ్మల ప్రసూన రెడ్డి జ్ఞాపకార్థం మూటకొండూర్ మండలం, చాకంపల్లి గ్రామంలో తుమ్మల కీర్తి వర్ధన్ రెడ్డి తన సొంత నిధులతో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రసూన రెడ్డి జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేలా ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేల్పుల రజిత శ్రీరాములు, ఉపసర్పంచ్ చేపూరి అంజిరెడ్డి, వాకిటి మల్లారెడ్డి, జల్తారు రాజు, బండ రజిత సతీష్, వేల్పుల నాగరాణి, వార్డు సభ్యులు సపిడి నవ్య ఉపేందర్, మోటూర్ సర్పంచ్ జెన్నె సిద్ధులు, మాజీ సర్పంచ్ పోతిరెడ్డి స్వప్న, స్కైలాబ్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.