ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు

01-11-2026 | 12:15am

పేదల సంక్షేమానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం: కాంగ్రెస్ నాయకులు.

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించి, దేశానికి, పేద ప్రజలకు ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని, పేదల సంక్షేమానికి విశేష కృషి చేశారని తెలిపారు.

పేద రైతులకు ఎడ్లు, ఎడ్లబండ్లు అందించడం, నిరుపేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వడం వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు.నిరాశ్రయులకు సొంత ఇళ్లు కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టి, ఆమె పేరుతో ఇందిరమ్మ కాలనీలను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.ఇందిరా గాంధీ పేరు నేటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందని, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల్లో ఆమె సేవలు, ఆశయాలు ప్రతిబింబిస్తున్నాయని నాయకులు అన్నారు.

ఆమె పేరు మీద నియోజకవర్గంలో 3,500 ఇళ్లు, కోనరావుపేట మండలానికి సుమారు 600 ఇళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. పేదలకు దుస్తుల పంపిణీతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన మహానేత ఇందిరా గాంధీ అని కొనియాడారు.దేశ నాయకులు మరణించిన తర్వాత కూడా ప్రజలు వారి సేవలను స్మరించుకుంటున్నారంటే అందుకు ఇందిరా గాంధీ వంటి నాయకుల ప్రజాసేవే కారణమని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సంక్షేమానికి కృషి చేయడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ చేపూరి గంగాధర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మానుక సత్యం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, డైరెక్టర్లు ఎండీ అజీమ్ పాషా, బాశెట్టి నాగరాజు, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రాస రవీందర్, అతికం శ్రీనివాస్, పెంతల శ్రీనివాస్, గ్రామ అధ్యక్షులు ముదాం ప్రదీప్, ధర రవి, పల్లె రవీందర్ రెడ్డి,వెంకటేష్, అనిల్, కుమ్మరి దేవదాస్, మల్యాల మనోజ్ కుమార్, కాంగ్రెస్ మండల కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు