వ్యాధి నిరోధక టీకాలు అందించాలి
ఖానాపూర్,(విజయక్రాంతి): జిల్లాలోని ప్రతి అర్హులైన చిన్నారికి ప్రభుత్వ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్(District Medical and Health Officer Dr. Rajender) అన్నారు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం velmal bopparam పరిధిలోని కనకాపూర్ గ్రామం(Khanapur Village)లో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్న తీరును, టీకాల రిజిస్టర్లను, లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నపిల్లలకు పుట్టినప్పటి నుంచి ప్రభుత్వం నిర్దేశించిన వయస్సు ప్రకారం అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలను నిర్ణీత సమయానికి అందించడం ద్వారా అనేక ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పించవచ్చని తెలిపారు.
ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలకు టీకాల షెడ్యూల్ ప్రకారం అన్ని డోసులు పూర్తయ్యేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా విస్తరణ మరియు మీడియా అధికారి బారె రవీందర్ స్థానిక సర్పంచ్ , ఆరోగ్య పర్యవేక్షకులు జగన్మోహన్ ,సాయిరెడ్డి, రాధ తదితరులు పాల్గొన్నారు