ఇందిరా గాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

31-10-2026 | 11:39pm

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్

వెంకటాపురం,(విజయక్రాంతి): వెంకటాపురం మండల(Venkatapuram Mandal) కేంద్రంలో ఇందిరా గాంధీ వర్ధంతి. పురస్కరించుకొని అంబేద్కర్ సెంటర్లో భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ స్వర్గీయ  ఇందిరా గాంధీ  42వ వర్ధంతి(Indira Gandhi 42nd Death Anniversary) సందర్భంగా ఆమె విగ్రహానికి కాంగ్రెస్. ఈ సందర్భంగా వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ... దేశ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి స్వర్గీయ ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

దేశ సమగ్రత, సమైక్యత కోసం ఆమె చేసిన కృషి భారత చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తాటి సరస్వతి ఉపసర్పంచ్ సర్ఫద్దిన్(సన్నీ) మలుగు జిల్లా ఉపాధ్యక్షులు దనపనేని వెంకటేశ్వర్లు బ్లాక్ అధ్యక్షులు చిడెంశివ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు చిట్టెం సాయి ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సాగర్ డర్ర రవి ఆత్మ కమిటీ డైరెక్టర్ కొండపర్తి సీతాదేవి సుందర్ రావు మాస్టర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు