గొర్ల కాపర్ల సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

20-09-2026 | 05:46pm

ఆలేరు, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఆలేరు మున్సిపాలిటీ 6వ వార్డు బహదూర్‌పేటలో(Bahadurpet) గొర్ల కాపర్ల సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం కురుమ సంఘం ఆవరణలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా వట్టిపల్లి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడిగా కుళ్ల శ్రీశైలం, ప్రధాన కార్యదర్శిగా వట్టిపల్లి రాములు, కోశాధికారిగా వట్టిపల్లి వెంకటేష్ ఎన్నికయ్యారు. గౌరవ సభ్యులుగా వస్పరి శ్రీనివాస్, బీదర్ యాదగిరి, వస్పరి నరసయ్యలను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు వట్టిపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధితో పాటు సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. అనంతరం ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షుడు కుళ్ల చంద్రశేఖర్, పెద్ద కురుమ వస్పరి స్వామి, జెట్ట బాల నరసయ్య, కుళ్ల సిద్ధులు, కుండె సంపత్, కుళ్ల వెంకటేష్, కర్రే సత్తయ్య, వస్పరి సంపత్‌కుమార్, చిన్నం వెంకటేష్, బీదని హరీష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు