57 దూడలకు ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ..
పశుసంపద అభివృద్ధికి దూడల ఆరోగ్య సంరక్షణ కీలకం.. రైతులకు అవగాహన కల్పించిన పశువైద్యాధికారి..
ఆలేరు, నవంబర్ 2 (విజయక్రాంతి): ఆలేరు మండలం శారాజీపేట గ్రామంలో సోమవారం పశుసంవర్ధక శాఖ(Department of Animal Husbandry) ఆధ్వర్యంలో దూడల నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కంతి మధు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి డాక్టర్ యాకూబ్ మాట్లాడుతూ, దూడల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు నట్టల నివారణ మందులు ఎంతో కీలకమని తెలిపారు.
క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు వేయించడం ద్వారా దూడలు ఆరోగ్యంగా పెరిగి పశుసంపద అభివృద్ధి చెందుతుందని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని మొత్తం 57 దూడలకు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేసి వేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవీఓ నరసింహ, గోపాలమిత్రులు సుధాకర్, శ్రీకాంత్, గోపి, గ్రామ రైతులు, పశుపోషకులు తదితరులు పాల్గొన్నారు.