నిలిచిపోయిన కనుగుట్ట వాగు నీటి దారలు
తగ్గిపోతున్న భూగర్భ జలాలు.
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కనుగుట్ట వాగు నీటి దారలు నిలిచిపోయాయి ప్రతి వేసవికాలంలో వాగు ఎండి పోతున్నది. అయితే ఈసారి ఐదు నెలల ముందుగానే వాగు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయే ఆస్కారం ఉంది. గత మూడు రోజుల నుండి మెల్లమెల్లగా నీటి ప్రవాహం నిలిచిపోవడంతో వాగు లో నీరు లేకపోవడంతో భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడే ఆస్కారం ఉందని పలు గ్రామాల ప్రజలు అంటున్నారు.
వాగు చెట్టు మోటార్లు తొలగించాలి
బోత్ మండలం నుండి ప్రవహించే ఈ వాగు చుట్టూ రైతులు విద్యుత్ మోటార్లు బిగించి సాగునీటి గా వాడుకుంటున్నారు. అయితే ఈ ఏడాది వర్ష బాగా పరిస్థితుల వల్ల వాగు ఐదు నెలల ముందుగానే ఎండిపోవడం అందుకు తోడు వాగు నుండి పంటల సాగుకు నీటిని వినియోగించుకోవడంతో ఇప్పుడే వాగు నీటి ప్రవాహాన్ని కోల్పోయింది. వాగు చుట్టూ ఉన్న మోటార్లను తొలగించకపోతే భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి ఎదురయ్యే ఆస్కారం ఉందని కౌట, కనుగుట్ట,పోచెర. గ్రామాల ప్రజలు అపోతున్నారు. రెవెన్యూ అధికారులు మోటార్ల తొలగించే విధంగా చూడాలని కోరుతున్నారు.
ఎండిపోనున్న బోరుబావులు
వాగు ప్రవాహం నిలిచిపోతే మండలంలోని పలు గ్రామాలలో బోరుబావులు ఎండిపోతాయి. ముఖ్యంగా కౌట, కనుగుట్ట, బోత్, పోచెర, గ్రామాలలో బోరుబావులు ఎండిపోతాయని అంటున్నారు. రానున్న ఎండాకాలం ని దృష్టిలో ఉంచుకొని అధికారులు వాగు చుట్టూ ఉన్న మోటర్లు తొలగించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.