డబుల్ బెడ్ రూమ్ అర్హుల సమగ్ర విచారణ పూర్తి చేయాలి
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్
ఖానాపూర్ (విజయక్రాంతి ): నిర్మల్ జిల్లా ఖానాపూర్ కొమరం భీమ్ చౌరస్తాలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో(Double-bedroom houses) నిజమైన అర్హులను గుర్తించి అనర్హులను తొలగించే సమగ్ర విచారణ త్వరగా పూర్తిచేసి అర్హులకు గృహాలను అప్పగించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్కు(District Collector) వినతిపత్రం అందజేశారు.
ఈ గృహాల్లో అనర్హులు చాలామంది కబ్జాలో ఉన్నారని ,నలుగురు కలెక్టర్లు మారిన విచారణ పూర్తి చేయకుండా కాలయాపన చేయడం వల్ల అర్హులు, నిరుపేదలు, ఇల్లు లేక అద్దె భారం భరించలేక సతమతమవుతున్నారని, అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి త్వరగా అర్హులను తేల్చాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం లింగన్న, డబుల్ బెడ్ రూమ్ల సాధన కమిటీ కన్వీనర్ తోటరాద, కో కన్వీనర్ షేక్ గౌస్, మాజీద్ ,షాదుల్లా, లక్ష్మి, గీత, రుక్మ, కమలా, గంగోత్రి ,తదితరులు ఉన్నారు.