భాదిత కుటుంబాలకు పరామర్శ
ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని ధర్మారావుపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సామల రవీందర్ రెడ్డి, కొత్తపల్లి నవీన్ తండ్రి ఊసయ్య అనారోగ్యం కారణం వల్ల మరణించిన వారి కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్(Former Yellareddy MLA Jajala Surender) గురువారం పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమావేసి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.కార్యక్రమంలో సర్పంచ్ ఉమర్, మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు,బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.