ఏఎంసీ చైర్మన్ నాగేశ్వరరావుకు ఘన సన్మానం

09-10-2026 | 12:32am

బోధన్,(విజయక్రాంతి): బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (Bodhan Agricultural Market Committee) చైర్మన్‌గా ఎన్నికైన ఎల్‌.ఎన్‌. నాగేశ్వరరావును బోధన్ లయన్స్ క్లబ్(Bodhan Lions Club) సభ్యులు ఘనంగా సన్మానించారు. బోధన్ లయన్స్ భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు నాగేశ్వరరావును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యుడు అమన్ బసవేశ్వరరావు(Lions Club member Aman Basaveswara Rao) మాట్లాడుతూ.. నాగేశ్వరరావు ఏఎంసీ చైర్మన్‌గా ఎన్నిక కావడం గర్వకారణమన్నారు. ప్రజాసేవలో ఆయనకు ఉన్న అనుభవం, వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు. నాగేశ్వరరావు గతంలో పెంటకుర్ సర్పంచ్‌గా, PACS సొసైటీ సెక్రటరీగా, బోధన్ మండల కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు ప్రస్తుతం లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని తెలిపారు.

లయన్స్ క్లబ్ సభ్యుడు లయన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. నాగేశ్వరరావు భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి బోధన్ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. బోధన్ ప్రాంత ఔన్నత్యాన్ని మరింత పెంచేలా సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ఏఎంసీ చైర్మన్ నాగేశ్వరరావును అభినందించారు.

మరిన్ని వార్తలు