కొనరావుపేట మండల ట్రాక్టర్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక

09-10-2026 | 12:39am

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల ట్రాక్టర్ యూనియన్(Konaraopeta Tractor Union)ను నూతనంగా గురువారం ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షులుగా ఎక్కాలదేవి అనిల్, ఉపాధ్యక్షులుగా దండు మహిపాల్, సుంకరి లక్ష్మణ్, గౌరవ అధ్యక్షులుగా రావులపల్లి మహిపాల్ రెడ్డి, కోశాధికారిగా చిద్రవేణి భానుచందర్, ప్రధాన కార్యదర్శిగా గంగుల ప్రశాంత్ మరియు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన కమిటీకి శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ.. ట్రాక్టర్ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల ట్రాక్టర్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు