నకిలీ పెట్టుబడి యాప్‌లతో జాగ్రత్త

09-10-2026 | 12:37am

- పాలమూరు యూనివర్సిటీ వాణిజ్య శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. కె. రాజుకుమార్  

బిజినేపల్లి: ప్రస్తుతం పెరుగుతున్న నకిలీ పెట్టుబడి యాప్‌లు, మోసపూరిత డబ్బు  సంపాదించే యాప్‌ల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అధిక లాభాలు వస్తాయని నమ్మించి ప్రజలను మోసం చేసే నకిలీ ఈ యాప్‌ల ద్వారా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉందని పాలమూరు యూనివర్సిటీ వాణిజ్య శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.కె. రాజు కుమార్ అన్నారు.

గురువారం పాలెం శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో (అటానమస్) బీఎఫ్‌ఎస్‌ఐ కెరీర్స్, బ్యాంకింగ్ మరియు ఆర్థిక రంగ భవిష్యత్‌కు నైపుణ్యాల అభివృద్ధి” అనే అంశంపై ఒక రోజు జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ప్రొఫెసర్ డా.కె.రాజు కుమార్ మాట్లాడుతూ.. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థ, యాప్ యొక్క పెట్టుబడి వేదిక విశ్వసనీయతను పరిశీలించాలని, పూర్తి అవగాహనతోనే ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

ఆధునిక ఆర్థిక రంగాలపై అవగాహన

వర్క్‌షాప్‌లో డిజిటల్ బ్యాంకింగ్, ఆర్థిక సాంకేతికత, కృత్రిమ మేధస్సు, డేటా విశ్లేషణ, సైబర్ భద్రత, డిజిటల్ ఆర్థిక సేవలు వంటి ఆధునిక అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ వాణిజ్య శాస్త్ర విభాగం అధిపతి డా.ఎం.అనురాధ రెడ్డి, పాలెం కళాశాల ప్రిన్సిపాల్ డా.పి. రాములు,  డా.వి.శ్రీనివాసులు, శివ దొడ్ల, డా.కె.సుష్మ, డా.డి.పద్మజ, డా.సి. నాగరాజు, తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు