మూలవాగు కాజ్‌వేకు తాత్కాలిక మరమ్మతులు

09-10-2026 | 12:29am

పండుగల వేళ తీరిన రాకపోకల కష్టం

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట(Konaraopeta) మండలంలోని మామిడిపల్లి, నిజామాబాద్ గ్రామాల మధ్య గల మూలవాగు కాజ్‌వేకు గ్రామ పంచాయతీ(Gram Panchayat) ఆధ్వర్యంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో కాజ్‌వే కొట్టుకుపోయి రెండు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రస్తుతం దసరా, బతుకమ్మ పండుగల వేళ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో పంచాయతీ పాలకవర్గం వెంటనే స్పందించింది.

సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి, ఉపసర్పంచ్ కాసర్ల పవిత్ర, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో జేసీబీ సాయంతో పైపులు అమర్చి, మొరం పోసి మార్గాన్ని రాకపోకలకు అనువుగా సిద్ధం చేశారు. పండుగల నేపథ్యంలో పంచాయతీ పాలకవర్గం చొరవ తీసుకుని తాత్కాలికంగా దారిని పునరుద్ధరించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో వరదలకు మళ్లీ తెగిపోకుండా ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత ప్రాతిపదికన బ్రిడ్జి లేదా పక్కా కాజ్‌వే నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు