ఎస్సీ వర్గీకరణ అమలుపై హర్షాతిరేకం!

04-11-2026 | 06:23pm

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకుల పాలాభిషేకం..

ఆలేరు, నవంబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం జీఓ జారీ చేయడాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి అడ్లూరి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగ నియామకాలతో పాటు ప్రమోషన్లలోనూ ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. దేశంలోనే ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణమని పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దళిత ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయానికి మద్దతుగా నిలిచిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు ఎమ్మెల్యేలు, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఎస్సీ వర్గీకరణ అమలుతో లక్షలాది మందికి న్యాయం జరిగి, విద్యా, ఉద్యోగ రంగాల్లో మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జాలిగం విఘ్నేష్, బొంతల నర్సింహ, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ కాకునూరి మహేందర్, నాయకులు ఎండీ మజహర్, చుక్క స్వామి, నాగారం శంకర్, బట్టు సందీప్, పస్తువుల సాయి, బొల్లేపల్లి అశోక్, శివ, మహేందర్, డాకూరి ప్రకాష్, నిరంజన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు