యశోదలో కీహోల్ సర్జరీ షురూ
ట్రైజెమినల్ న్యూరాల్జియా డే సందర్భంగా ఏర్పాటు
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ప్రపంచ ట్రైజెమినల్ న్యూరాల్జియా దినోత్సవం(World Trigeminal Neuralgia Day) సందర్భంగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్‌లో(Yashoda Hospitals, Secunderabad) ప్రత్యేక ట్రైజెమినల్ న్యూరాల్జియా క్లినిక్‌ను ప్రారంభించారు. తీ వ్రమైన ముఖ నొప్పితో బాధపడే రోగులకు అత్యాధునిక కీహోల్ ఎండోస్కోపిక్ మైక్రో వాస్క్యులర్ డీకంప్రెషన్ శస్త్రచికిత్స(Surgery) ద్వారా చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు 110 మందికి పైగా రోగులకు ఈ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు.
యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ యూనిట్ హెడ్ డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. సరైన సమయంలో వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే రోగులు సాధారణ జీవితానికి తిరిగి రావచ్చన్నారు. ట్రైజెమినల్ న్యూరాల్జియాపై అవగాహన కల్పించడం, రోగులకు సరైన మార్గదర్శక త్వం అందించడమే లక్ష్యంగా ప్రత్యేక క్లినిక్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.
సీనియర్ న్యూ రోఫిజీషియన్, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.ఎ న్. కోమల్ కుమార్ మాట్లాడుతూ.. మెదడులోని రక్తనాళం ట్రైజెమినల్ నర్వస్‌పై ఒత్తిడి చేయడం వల్ల విద్యుత్ షాక్‌లో తీవ్రమైన నొప్పి రావచ్చన్నారు. ప్రారంభంలో మందులతో చికిత్స చేస్తామని, అవసరమైన సంద ర్భాల్లో శస్త్రచికిత్సను పరిగణిస్తామని చెప్పా రు. కార్యక్రమంలో సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ ఆర్. అయ్యదురై పాల్గొన్నారు.