బంతితో బ్రెయిన్‌కీ వర్కౌట్‌

05-10-2026 | 12:38pm

నటి, ఫిట్‌నెస్‌ ప్రియురాలు శిల్పా శెట్టి తన తాజా వర్కౌట్‌ వీడియో (Workout Video)ను సోషల్‌ మీడియాలో (Social Media) షేర్‌ చేశారు. బంతితో పలు వ్యాయామాలు చేస్తూ కనిపించిన ఆమె.. వీటి ద్వారా శరీరంతో పాటు మెదడుకూ ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. 


బంతి వ్యాయామాలు ఏకాగ్రత, శ్రద్ధ, మానసిక స్పష్టతను పెంచడంతో పాటు శరీర సమన్వయాన్ని మెరుగుపరుస్తాయని శిల్పా పేర్కొన్నారు. మెదడు, శరీరం కలిసి పనిచేసేలా చేసే కదలికలు జ్ఞాపకశక్తి, మోటార్‌ నియంత్రణ (Motor Control), సమన్వయానికి దోహదపడతాయని వివరించారు. ప్రతి సోమవారం ఫిట్‌నెస్‌ ప్రేరణను (Fitness Inspiration) పంచుకునే శిల్పా.. ఫాలోవర్లను చురుకైన, ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రోత్సహిస్తున్నారు.

మరిన్ని వార్తలు