ఏబీవీపీ కీలక బాధ్యతల్లో సంతోష్
పాపన్నపేట, అక్టోబర్ 05: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) మెదక్ విభాగ్ అభ్యాసవర్గ సమావేశాలు ఈ నెల 3, 4 తేదీల్లో దుబ్బాక నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా హాస్టల్స్ కన్వీనర్‌గా పాపన్నపేటకు చెందిన సంతోష్‌ను నియమించారు.
ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మెదక్ జిల్లా హాస్టల్స్ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించినందుకు ఏబీవీపీ జిల్లా, రాష్ట్ర బాధ్యులకు కృతజ్ఞతలు (thanks) తెలిపారు.విద్యార్థుల సమస్యలపై ఎల్లప్పుడూ పోరాటం (fight) చేస్తానని, భవిష్యత్‌లోనూ అనేక ఉద్యమాలు చేపడుతూ జాతీయ పునర్నిర్మాణం కోసం పనిచేస్తానని సంతోష్ పేర్కొన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి (effort) చేస్తానని తెలిపారు.