ఐటీ రైడ్స్‌పై రకుల్‌ క్లారిటీ

05-10-2026 | 12:27pm

తన పేరును ఆదాయపు పన్ను శాఖ సోదాలతో ముడిపెడుతూ వస్తున్న వార్తలను నటి రకుల్ ప్రీత్ సింగ్ ఖండించారు. ఐటీ సోదాలతో తనకు ఎలాంటి సంబంధం (connection) లేదని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు.వాస్తవాలను నిర్ధారించుకోకుండా కొన్ని మీడియా సంస్థలు వార్తలను సంచలనంగా ప్రచారం (publicity) చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆర్మీ కుటుంబం నుంచి వచ్చానని, 20 ఏళ్ల వయసు నుంచే క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నానని తెలిపారు.

తనకు ఎలాంటి అక్రమ విదేశీ లావాదేవీలు, బినామీ ఆస్తులు లేవని రకుల్ స్పష్టం చేశారు. తనపై తప్పుడు కథనాలు ప్రచురించిన వారు వాటిని ఉపసంహరించుకుని, వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. తనపై వస్తున్న వార్తల విషయంలో పూర్తి క్లారిటీ (clarity) ఇవ్వాల్సిన బాధ్యత మీడియాపై ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు