కిమ్స్‌లో అరుదైన చికిత్స

08-10-2026 | 05:05am

ఛాతీ తెరవకుండానే చీలిన ప్రధాన రక్తనాళానికి చికిత్స

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): గుండె నుంచి శరీరమంతటికీ రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళం(Main blood vessel) అయోర్టా గోడ చీలిపోయిన 61 ఏళ్ల వ్యక్తికి కిమ్స్ కొండాపూర్ వైద్యులు(KIMS Kondapur doctors) అత్యాధునిక పద్ధతిలో విజయవంతంగా చికిత్స అందించారు. ఛాతీ తెరిచి చేసే పెద్ద శస్త్రచికిత్స(Surgery) అవసరం లేకుం డా స్థానిక మత్తుతోనే ప్రత్యేక స్టెంట్ అమర్చి చీలిన భాగాన్ని సరిచేశారు. చికిత్స అనంతరం రెండో రోజే రోగిని డిశ్చార్జి చేశారు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన పోలీసు అధికారి కెశవరెడ్డి (61) ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక రక్తపోటుతో ఆసుపత్రికి వచ్చారు.

పరీక్షల్లో అయో ర్టాలో టైప్-బి అరోటిక్ డిసెక్షన్ ఉన్నట్లు గు ర్తించారు. చీలిక ఎడమ సబ్క్లేవియన్ ధమని సమీపంలో ఉండటంతో చికిత్స సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో థొరాసిక్ ఎండోవాస్కులర్ అరోటిక్ రిపేర్ (టీ-ఈ-వీ-ఏ-ఆర్) పద్ధతిని ఉపయోగించారు. రోగి అయోర్టా నిర్మాణానికి అనుగుణంగా స్టెంట్ గ్రాఫ్ట్లో ప్రత్యేక మార్పులు చేసి, ఎడమ సబ్క్లేవియన్ ధమని వద్ద చిన్న రంధ్రం ఏర్పాటు చేసి స్టెం ట్ను అమర్చారు. దీంతో చీలిన భాగాన్ని మూసివేయడంతో పాటు ఎడమ చేతికి రక్తప్రసరణ కొనసాగింది.

ఈ చికిత్సకు కన్స ల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ నిషాన్ రెడ్డి బి. నేతృత్వం వ హించగా, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ యార్లగడ్డ వెంకన్న చౌదరి, డాక్టర్ మీనా రెడ్డి సహకరించారు. అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాల జీ, ఇంటర్నల్ మెడిసిన్, నర్సింగ్, సాంకేతిక విభాగాల సిబ్బంది చికిత్సలో పాల్గొన్నారు. చికిత్స అనంతరం రోగికి ఎలాంటి తీవ్రమైన సమస్యలు తలెత్తలేదు. త్వరగా నడవగలిగారు. రెండో రోజే డిశ్చార్జి అయ్యారు.

మరిన్ని వార్తలు