నూతన కమిషనర్‌కు ఘన స్వాగతం
- పట్టణ అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలి
- మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్
నర్సంపేట, నవంబరు 4 ( విజయ క్రాంతి ):నర్సంపేట మున్సిపల్(Narsampet Municipal) నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన కంచర్ల నరేష్ రెడ్డికి మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తాలు నూతన కమిషనర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ.
నూతన కమిషనర్ నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణాభివృద్ధి మరింత వేగవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి,
పాలకవర్గం- అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పున్నం నరసింహారెడ్డి, సలావుద్దీన్ అయూబ్ ఖాన్, మాదాసి రవి, బీరం భరత్ రెడ్డి, కొత్తకొండ మేఘన శ్యామ్ రాజ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.