ఆరుతడిపై దృష్టి సారించాలి
మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నా సుకుమారి
బెల్లంపల్లి, (విజయక్రాంతి): రాష్ట్రంలో పెల్లిను ప్రభావం అధికంగా ఉండడంతో రైతులు తక్కువ నీటితో సాగే ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని బెల్లంపల్లి మార్కెట్ కమిటీ(Bellampalli Market Committee) చైర్మన్ రత్నా సుకుమారి కోరారు. బుధవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి క్లస్టర్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆగ్రో ఫారెస్ట్రీ పంటలపై అవగాహన,
రైతు శిక్షణ కార్యక్రమంలో బెల్లంపల్లి ఉద్యాన అధికారి అర్చనతో కలిసి మాట్లాడారు. అటవీ పంటల సాగు శ్రీగంధం, టేకు, సరుగుడు, యూకలిప్టస్, మునగ మొదలగు సాగు విధానం, వాటి యాజమాన్యం, ప్రభుత్వం అటవీ పంటలైన వెదురు సాగుకు అందిస్తున్న సబ్సిడీలను వివరించారు. ఆత్మ చైర్మన్ రౌతు సత్తన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీలను డ్రిప్, స్ప్రింక్లర్, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మునగ, టేకు, సరుగుడు, చెట్లను నాటుకోవాలని సూచించారు
కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ భీమా రాజేష్ లు మాట్లాడుతూ అటవీ పంటల ప్రాముఖ్యాన్ని, అటవీ పంటలను అమ్మడానికి తీసుకోవాల్సిన అనుమతులను వివరించారు. ఈ కార్యక్రమంలో కన్నాల గ్రామ సర్పంచ్, ఫీల్డ్ ఆఫీసర్ రాహుల్ రైతులు పాల్గొన్నారు.