పిల్లల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక దృష్టి సారించాల

04-11-2026 | 03:33pm
  1. సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ 
  2. చిన్నారులకు అక్షరాభ్యాసం పౌష్టికాహారం పంపిణీ

గణపురం, నవంబర్ 04 (విజయక్రాంతి):పిల్లల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక దృష్టి సారించాలని సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్(Sarpanch Katkuri Radhika Srinivas) అన్నారు. గణపురం మండల కేంద్రంలోని బీసీ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ బుధవారం చిన్నారులకు, అక్షరాభ్యాసం తో పాటు గర్భిణులకు బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పిల్లల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు.

ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, గుడ్లు, పాలు, బాలామృతం వంటి పోషకాహారాన్ని అందించడంతో పాటు, గర్భిణులు, బాలింతలకు కూడా పోషకాహార సేవలు అందిస్తోంది. చిన్నారుల ఆరోగ్య పరీక్షలు, ప్రాథమిక విద్య, టీకాలపై అవగాహన వంటి సేవలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శ్రావణి, చిన్నారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు