రోడ్డు డివైడర్ మధ్య విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు ఆపండి
తాండూరు బిజెపి పట్టణ శాఖ డిమాండ్
తాండూరు, సెప్టెంబర్ 24, (విజయక్రాంతి): నిత్యం జనాలు, విద్యార్థులతో రద్దీగా ఉండే రోడ్డు డివైడర్ మధ్యన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్(Electrical transformer) ఏర్పాటుకు జరుగుతున్న పనులను వెంటనే ఆపాలని వికారాబాద్ జిల్లా తాండూర్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ(Bharatiya Janata Party Town Unit) అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు నాగారం మల్లేశం, శ్రీకాంత్, అంతారం కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు.
పొట్లి మహారాజ్ దేవాలయం సముదాయం కోసం ఇందిరా చౌక్ నుండి రైల్వే స్టేషన్ వెళ్లే మార్గంలో గల రోడ్డు డివైడర్ పై విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని వెంటనే విద్యుత్ అధికారులు మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాట్లు అడ్డుకోవాలని విద్యుత్ శాఖ మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని మరోచోట సురక్షితమైన స్థలంలో ఏర్పాటు చేసుకోవాలని డిమాండ్ చేశారు.