గోదావరిఖనిలో దారుణం.. సింగరేణి ఉద్యోగి హత్య
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని(Godavarikhani)లో అర్ధరాత్రి దారుణ హత్య(Murder) కలకలం రేపింది. సింగరేణి(Singareni) సంస్థలో పనిచేస్తున్న రాజశేఖర్ అనే యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతడు ప్రాణాలు కోల్పోయాడు. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు సమాచారం.
సమాచారం అందుకున్న గోదావరిఖని పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు. నిందితుల కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. హత్యకు గల కారణాలు, వ్యక్తిగత కక్షల కోణంలోనూ దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.