ఢిల్లీలో దట్టమైన పొగమంచు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. సోమవారం ఉదయం ఇండియా గేట్(India Gate), కర్తవ్య పథ్ పరిసరాల్లో దట్టమైన పొగమంచు(Fog) కనిపించింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో దృశ్యమానత తగ్గగా, గాలి నాణ్యత కూడా ఆందోళన కలిగిస్తోంది. చలికాలం(Winter) ప్రభావంతో పాటు వాతావరణ పరిస్థితులు కాలుష్య కారకాలు గాలిలోనే నిలిచిపోయేందుకు కారణమవుతున్నాయి.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) గణాంకాల ప్రకారం ఆదివారం ఉదయం ఢిల్లీ సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 237గా నమోదై 'పేలవం' (Poor) కేటగిరీలో ఉంది. పలు ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి మరింత అధ్వానంగా నమోదైంది. రానున్న రోజుల్లోనూ ఉదయం వేళ పొగమంచు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పెరుగుతున్న కాలుష్యంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.