విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

15-09-2026 | 05:05pm

- బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముదిరాజ్ సోదరుల ఫంక్షన్ హాల్ నిర్మాణం

 - బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు పిల్లుట్ల రఘు

హుజూర్ నగర్: విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని హుజూర్ నగర్(huzurnagar) బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు పిల్లుట్ల రఘు అన్నారు. మంగళవారం పట్టణంలోని 6 వార్డు ఇంచార్జ్ లక్క వెంకన్న ఆధ్వర్యంలో ముదిరాజ్ బజార్ లో ఏర్పాటుచేసిన వినాయక చవితి వేడుకల్లో(Vinayaka Chavithi celebrations ) పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పిల్లుట్ల రఘు మాట్లాడారు... బిఆర్ఎస్ ప్రభుత్వం(BRS government) ఏర్పడిన వెంటనే ముదిరాజ్ ఫంక్షన్ హాల్ ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గణేష్ నవరాత్రులు ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించు కోవాలని తెలిపారు.అనంతరం పౌరోహితుడు ఆత్కూరి సందీప్ ఆధ్వర్యంలో పిల్లుట్ల రఘుకు ప్రత్యేక పూజలు జరిపించి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు