ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తుల తాకిడి
15-09-2026 | 09:23am
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి(Khairatabad Maha Ganapati) దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఖైరతాబాద్‌లో సందడి నెలకొంది. భక్తులు బారులు తీరుతూ మహాగణపతిని దర్శించుకుంటున్నారు.
భక్తుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే ఖైరతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దర్శనానికి వచ్చే భక్తుల వాహనాల కోసం అధికారులు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. రద్దీ దృష్ట్యా భక్తులు పోలీసులకు సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.