ఎమ్మెల్యే మల్లారెడ్డి చేతులమీదుగా అప్ డేటింగ్ ప్యార్ సినిమా విడుదల

15-09-2026 | 05:32pm

ఘట్ కేసర్,(విజయక్రాంతి): వినాయక చవితి(Ganesha Chavithi) పర్వదినాన్ని పురస్కరించుకుని ఘట్ కేసర్ పట్టణంలో అప్ డేటింగ్ ప్యార్ చిత్రాన్ని(Updating Pyaar movie) మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Chamakura Mallareddy) యూట్యూబ్‌లో అధికారికంగా విడుదల చేశారు. నేటి తరం యువతలో మారుతున్న ప్రేమ సంబంధాలు, పెళ్లికి ముందే గర్భం దాల్చినప్పుడు ఎదురయ్యే సమస్యలు, కుటుంబ ఒత్తిడి, సమాజపు చూపు, మానసిక సంఘర్షణలు వంటి సున్నితమైన అంశాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన చిత్రం “అప్ డేటింగ్ ప్యార్.” కలల భానుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

వినాయక చవితి పర్వదినాన ఎమ్మెల్యే మల్లారెడ్డి చేతుల మీదుగా సినిమా అధికారిక విడుదల జరగడం విశేషం. ఈకార్యక్రమంలో చిత్ర దర్శకుడు షేను భాను చందర్, హీరో మహేష్, హీరోయిన్ సుష్మిత గిరిధారి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి మేకల నర్సింగ్ రావు తదితర ముఖ్య నాయకులు, చిత్ర బృంద సభ్యులు పాల్గొన్నారు. యువత, కుటుంబ సంబంధాలు, సమాజం మధ్య నేటి పరిస్థితులను ప్రతిబింబించే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ కలల భానుడు యూట్యూబ్ ఛానల్ లో వీక్షించి ఆదరించాలని చిత్ర బృందం కోరింది.

మరిన్ని వార్తలు