పరేడ్‌ గ్రౌండ్‌కు కిషన్‌రెడ్డి

15-09-2026 | 08:50am

హైదరాబాద్‌: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ నెల 17న నిర్వహించనున్న కార్యక్రమాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు ఉదయం 9 గంటలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) పరేడ్‌ గ్రౌండ్‌కు వెళ్లనున్నారు.

పరేడ్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న సైనిక దళాల రిహార్సల్స్‌(Rehearsals)ను కిషన్‌రెడ్డి పరిశీలించనున్నారు. విమోచన దినోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ఇతర నిర్వహణ అంశాలపై అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు