కేసీఆర్ తోనే గిరిజనుల అభివృద్ధి

15-09-2026 | 04:59pm

17న తండాల్లో కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం 

మహబూబాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) పరిపాలనలో గిరిజనుల అభివృద్ధికి బాటలు వేసారని, ఈనెల 17న తండాల్లో కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం(Palabhishekam) నిర్వహించాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Former Minister Satyavathi Rathod) పిలుపునిచ్చారు. మహబూబాబాద్ నియోజకవర్గ(Mahabubabad Constituency) బీఆర్ఎస్ పార్టీ గిరిజన నాయకుల సమావేశం మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. కేసీఆర్ తండాలను పంచాయతీలుగా చేయడంతో పాటు ఆరు శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు.

మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్(Former MLA Banoth Shankar Naik) మాట్లాడుతూ కేసిఆర్ పాలనలో గిరిజనులకు స్వర్ణ యుగంగా మారిందని, ‘అపన్ తాండెమా..అపన్ రాజ్’ తో ఆత్మగౌరవానికి అంకురార్పణ జరిగిందన్నారు. గిరిజనులు మూడు వేలకు పైగా సర్పంచులు, 25 వేలకు పైగా వార్డు సభ్యులు రాజకీయాల్లో ఇప్పుడు ప్రాతినిత్యం వహిస్తున్నారని చెప్పారు. మళ్లీ కేసీఆర్ రావాలి గిరిజన సంక్షేమం స్వర్ణ యుగంగా మారాలి అనే ఆకాంక్ష తండాల్లో వినిపిస్తోందన్నారు.

మరిన్ని వార్తలు