అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ ఊరట
15-09-2026 | 09:56am
అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల(Foreign students)కు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను నాలుగేళ్లకే పరిమితం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన అమలును ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా అడ్డుకుంది. దీంతో అమెరికాలో చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.
బోస్టన్ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి ఎఫ్. డెన్నిస్ సేలర్ దేశవ్యాప్తంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగేళ్ల పరిమితి అమల్లోకి వస్తే పీహెచ్‌డీ వంటి కోర్సులు పూర్తి చేయడానికి అదనపు అనుమతులు అవసరమయ్యేవి. అయితే ఈ నిబంధనతో అమెరికా విశ్వవిద్యాలయాలు, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ అక్టోబర్ 2న జరగనుంది.