గణనాథుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి
15-09-2026 | 05:20pm
పూజల్లో పాల్గొన్న దయాకర్ రెడ్డి దంపతులు
ఖమ్మం,(విజయక్రాంతి): రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి(Tumburu Dayakar Reddy) దంపతులు వినాయక చవితి(VInayaka Chaturthi) సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం బోనకల్ రోడ్డులోని ఎస్ఆర్ హోమ్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి మండపంలో దయాకర్ రెడ్డి దంపతులు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.