పులివెందులలో ఉద్రిక్తత
15-09-2026 | 09:35am
వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గణేష్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు పుష్పనాథ్‌రెడ్డి, విజయ్‌రెడ్డిల మధ్య స్థానిక వివాదం నేపథ్యంలో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నాయి.
ఈ ఘర్షణలో విజయ్‌కుమార్‌రెడ్డి ఇంటి వద్ద నిలిపి ఉంచిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు హజ్ కమిటీ డైరెక్టర్ భాషా మధ్యవర్తిత్వానికి ప్రయత్నించారు. అయితే ఆయన అక్కడికి చేరుకున్న సమయంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. దీంతో ఆయన గన్‌మెన్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు సమాచారం. ఘటనతో పులివెందులలో కలకలం రేగింది.