నాగోల్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
హైదరాబాద్, సెప్టెంబర్ 15.(విజయక్రాంతి):హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్(Nagole Police Station) పరిధిలో రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్యకు గురయ్యాడు. బండ్లగూడ ఆనంద్‌నగర్ చౌరస్తా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాత కక్షలు, సెటిల్మెంట్లకు సంబంధించిన డబ్బుల విషయంలో ఇద్దరు రౌడీషీటర్ల మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇల్లెందుకు చెందిన మహమ్మద్ నహీమ్, ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్ చిన్ననాటి స్నేహితులుగా ఉన్నప్పటికీ.. వివాదాల నేపథ్యంలో హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరిపైనా ఇప్పటికే పలు కేసులు ఉండటంతో పాటు ఇల్లెందు పోలీస్ స్టేషన్లో రౌడీషీట్లు ఉన్నట్లు సమాచారం. నిందితుడు మహేష్, అతడి అనుచరుల కోసం నాగోల్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.