మున్సిపల్ ఆస్తి అక్రమ రిజిస్ట్రేషన్‌పై కలెక్టర్ సీరియస్
అక్రమ రిజిస్ట్రేషన్ల గుట్టు రట్టు
బాధ్యులైన అధికారులపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలకు ఆదేశం
సూర్యాపేట,(విజయక్రాంతి): హుజూర్నగర్ మున్సిపాలిటీ(Huzurnagar municipal) పరిధిలోని 192 గజాల మున్సిపల్ బావి, పక్కనే వున్న స్థలాన్ని నకిలీ రికార్డులతో ప్రైవేట్ వ్యక్తుల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంపై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(Collector Tejas Nandalal Pawar) కఠిన చర్యలకు ఆదేశించారు.
ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేలిన అప్పటి మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఏఆర్వో/ఆర్వోలపై క్రమశిక్షణా చర్యలతో పాటు క్రిమినల్ ఫిర్యాదు చేయాలని, బాధ్యుడైన అవుట్సోర్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను తొలగించాలని ఆదేశించారు. వివాదాస్పద స్థలంపై రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి రికార్డులను సరిచేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించిన కలెక్టర్, జిల్లాలోని ఇతర మున్సిపల్ ఆస్తులపై కూడా సమగ్ర విచారణ జరిపి 15 రోజుల్లోగా నివేదిక అందజేయాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు.