ప్రభుత్వ చేయూతతో విద్యార్థులు

08-10-2026 | 05:55pm

సూర్యాపేట జిల్లా డీఐఈఓ బి.సులోచనా రాణి.

నేరేడుచర్ల, అక్టోబర్08(విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వం  ఇంటర్ విద్య(Telangana Government Inter Education) బలోపేతం కోసం అందిస్తున్న చేయూతతో విద్యార్థులు ప్రయోజకులు కావాలని సూర్యాపేట జిల్లా ఇంటర్ విద్యాధికారి బి.సులోచన రాణి(Intermediate Education Officer B. Sulochana Rani) అన్నారు. గురువారం నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు, కాలేజీ బ్యాగులు, బెల్టు,ఐడి కార్డులు,షూస్ తదితరాలు పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఇంటర్ విద్య ను ప్రైవేటుకు దీటుగా ముందుకు తీసుకుపోతూ పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఎన్నో మార్పులను చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం గర్వకారణం అన్నారు. దీనిలో భాగంగానే కళాశాల భవనాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా అన్ని వసతులు,సౌకర్యాలు ఇప్పటికే కల్పించిందన్నారు.

ప్రభుత్వ కళాశాలలో చదివి విద్యార్థులందరికీ ఉచితంగా పుస్తకాలు, నోట్స్ తో పాటు దుస్తులు తదితరాలు అందించడం విద్యార్థులకు వరం లాంటిది అన్నారు. ఇంకా ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం కూడా అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని, త్వరలో విద్యార్థులకు భోజనం పథకం కూడా వస్తుందని తెలిపారు.

ఈ సదవకాశాన్ని పేద మధ్యతరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహిoచాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రైవేటు మోజులో పడకుండా ప్రభుత్వ విద్య వైపు మొగ్గు చూపాలని సూచించారు. అనంతరం కళాశాల ఆవరణలో విద్యార్థినిలచేత ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఆటపాటలతో విద్యార్థినిలు, అధ్యాపకురాలు అలరింపజేశారు.

ప్రిన్సిపల్ నీరజ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను విద్యార్థులు అందిపుచ్చుకోని ఈ సంవత్సరం మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించి కళాశాలకు పేరు ప్రతిష్టలు తేవాలన్నారు. అలాగే వచ్చే సంవత్సరం అడ్మిషన్  సంఖ్య మరింత పెరగాలని కోరారు.

ఈ కార్యక్రమాలలో హుజూర్నగర్ ప్రిన్సిపల్ గీతాబాయి కళాశాల అధ్యాపకులు పి. వెంకటరమణ, డాక్టర్ మద్దిమడుగు సైదులు, ప్రణతి, కేఎల్ఎన్ రావు, వెంకన్న,శ్రీనివాసులు, సునీత, ప్రసాద్, అంజయ్య, నరసింహాచారి, గణేష్, వీరు,వెన్నెల,జానకి రామ్ రెడ్డి సిబ్బంది అన్వేష్, వెంకన్న, దుర్గయ్య, సుశాంత్, మహబూబ్ బేగం, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు