మహిళా డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబురాలు

08-10-2026 | 08:19pm

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని మర్కల్ గ్రామ స్టేజి వద్ద గల తెలంగాణ రాష్ట్ర గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను గురువారం  ఘనంగా నిర్వహించారు.అధ్యాపకులు, విద్యార్థులంతా కలిసి తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలు ప్రతిబింభించేలా తీరొక్క పువ్వులతో బతుకమ్మ ను అలంకరింంచి, ఆటపాటలతో అలరించారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు..కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. శోభారాణి, వైస్ ప్రిన్సిపల్ ఎస్. కృష్ణవేణి, కల్చరల్ కమిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ కే. వనజ, సభ్యురాలు నవనీత తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థినులు పాల్గొని, విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు