కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా ఇవ్వాలి

08-10-2026 | 08:25pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సింగరేణి బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సీహెచ్‌పీ రైల్వే మెయింటెనెన్స్(Goleti CHP Railway Maintenance) కాంట్రాక్టు కార్మికుల(Contract workers)కు నూతన టెండర్ పిలిచి అందరికీ ఉపాధి కల్పించాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు భోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.20 వేల లాభాల వాటా చెల్లించాలని కోరుతూ బుధవారం ఏరియా ఎస్‌వోటు జీఎం స్వామిరాజు(Area SO to GM Swamiraju)కు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు తక్కువ వేతనాలతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కార్మిక చట్టాలను అమలు చేసి శ్రమదోపిడీని అరికట్టాలని, వెంటనే లాభాల వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులు చల్లూరి రాజన్న, కిరణ్, మహేందర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు