ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
08-10-2026 | 08:21pm
కుబీర్,(విజయక్రాంతి): కుబీర్ మండల(Kubir mandal) కేంద్రంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల్(MLA Ramarao Patil) గురువారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు(Indiraamma House Sanctions) పత్రాలను పంపిణీ చేశారు. అరులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. నిరుపేదలందరికీ ప్రభుత్వం ఐదు లక్షల సాయంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పార్టీ నాయకులు పాల్గొన్నారు