రామేశ్వర్‌పల్లిని మోడల్ సోలార్ విలేజ్‌గా అభివృద్ధి చేస్తాం
భిక్కనూర్, అక్టోబర్ 8 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్‌గా(Model Solar Village) అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వక్తలు తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ(Telangana University) దక్షిణ ప్రాంగణం, గ్రామపంచాయతీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సౌర విద్యుత్తుపై అవగాహన సదస్సు నిర్వహించారు.
అంకోల్ క్యాంప్ సర్పంచ్ బి. రాము, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డా. ఆర్. సుధాకర్‌గౌడ్ పాల్గొన్నారు. సౌర విద్యుత్తుతో ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలున్నాయని తెలిపారు. ప్రధాని సూర్యఘర్ పథకం, సబ్సిడీలు, రుణ సదుపాయాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికీ సౌర విద్యుత్తు చేరేలా కృషి చేస్తామని సర్పంచ్ రాణి తెలిపారు.