పిల్లుట్ల రఘుకు సేవా రత్నం అవార్డు

04-10-2026 | 07:51pm

* సమాజ సేవలో రఘు ఆదర్శం... మారుమూల గ్రామాలలోనూ ప్రత్యేక గుర్తింపు

* రఘు ఈ ప్రాంతానికి దొరికిన రత్నం - మాజీ ప్రజా ప్రతినిధులు

గరిడేపల్లి, అక్టోబర్ 4,(విజయ క్రాంతి) : ఓజో ఫౌండేషన్(Ojo Foundation) అధినేత, హుజూర్నగర్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు పిల్లుట్ల రఘు(Pillutla Raghu) ఈ ప్రాంతానికి దొరికిన రత్నం లాంటివాడని గరిడేపల్లి మండల(Garidepalli Mandal) మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు(BRS leaders) అన్నారు. దేశ రాజధాని ఢిల్లీ కోటలో సేవారత్నం అవార్డు(Sevaratna Award) అందుకుని డాక్టరేట్ పొందిన పిల్లుట్ల రఘుకు ఆదివారం మండల కేంద్రమైన గరిడేపల్లి లో మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు బి ఆర్ ఎస్ నాయకులు ఓజో ఫౌండేషన్ ద్వారానే కాకుండా బిఆర్ఎస్ పార్టీ ద్వారా ఆయన ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసి అందరి మన్ననలు పొందాలని వారు ఆకాంక్షించారు. గత కొన్ని సంవత్సరాలుగా సమాజ సేవే లక్ష్యంగా ఫౌండేషన్ అనే సంస్థను ప్రారంభించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడమే కాక, నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ అందరిలో గుర్తింపు తెచ్చుకున్న పిల్లుట్ల రఘుకు సేవారత్నం అవార్డు రావడం గొప్ప విషయం అన్నారు.

పక్కవారితో మాకేంటి అనే విషయంలో రోజురోజుకు సమాజంలో పెరిగిపోతున్న ఈ సమయంలో సమాజానికి సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగటం ఎంతో అభినందనీయమని అన్నారు. రఘు ఆధ్వర్యంలో చేసిన ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించిందని వారు అన్నారు. అనంతరం సేవారత్నం అవార్డు అందుకున్న డాక్టర్ రఘు మాట్లాడుతూ రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

పార్టీ బలోపేతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు సహకారాలతోనే సాధ్యమవుతుందని తెలిపారు. మొదట వెళ్ళుట రఘును పూలమాలలతో శాలువులతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గడేపల్లి మండల పార్టీ మాజీ అధ్యక్షులు గుగులోతు కృష్ణ నాయక్, సింగిల్ విండో మాజీ చైర్మన్ వీరం రెడ్డి శంబిరెడ్డి, గుత్తికొండ వెంకటరమణారెడ్డి, మన్నెం వేణు యాదవ్, సర్పంచులు వాంకుడోత్ రవి నాయక్, మురళి, మాజీ సర్పంచులు నల్లపాటి వీరమ్మ భాస్కర్, కోట వీరస్వామి, గ్రామ శాఖ అధ్యక్షులు, నరేందర్ నాయక్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు సందీప్ నాయక్, యూత్ అధ్యక్షులు మండవ నాగేశ్వరరావు తోపాటు పలువురు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు