గోదాంలో భారీ అగ్నిప్రమాదం

04-10-2026 | 05:37pm

వరంగల్: గ్రేటర్ వరంగల్‌లోని ఎన్టీఆర్ నగర్ రోడ్డులో ఎనుమాముల మార్కెట్‌కు ఎదురుగా ఉన్న సాయి ప్లాస్టిక్ స్క్రాప్ గోదాము(Sai Plastic Scrap Godown)లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా దుకాణం మొత్తం వ్యాపించడంతో దట్టమైన పొగ ఆకాశంలోకి ఎగబాకింది. దీంతో చుట్టు ప్రక్కల ఉన్న స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటహటిన రెండు ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కారణం, ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది తెలియాల్సి ఉంది. కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు