ఉద్యమకారుల రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న బాన్సువాడ ఉద్యమకారులు..
బాన్సువాడ, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ఆధ్వర్యంలో, ప్రభుత్వం ప్రభుత్వం తెలంగాణ స్వరాష్టం కొరకు ఉద్యమాలు చేసిన వారిని వెంటనే గుర్తించి ఇచ్చిన హామీలను ఇచ్చిన హామీలను నేరవార్చాలని కోరుతూ ఆల్వాల్ జేఏసీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 18 వ రోజుకు చేరుకున్నాయి.
ఈ దీక్షలో భాగంగా ఆదివారం TUF తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉడుత గంగాధర్ గుప్త,బాన్స్ వాడ మండల కార్యదర్శి దమ్మణపేట భాస్కర్ గౌడ్,సంజీవ్ రెడ్డి, సత్యనారాయణ, పి. బస్వారాజ్, పరమేశ్వర్. మరియు ముఖ్య అతిధిగా హుజురాబాద్ నియోజకవర్గ జేఏసీ చైర్మన్ అవునూరి సమ్మయ్య మరియు ఆల్వాల్ జేఏసీ సభ్యులు పట్లోలా సురేందర్ రెడ్డి, పుట్నాల కృష్ణ, ఆనంతుల సంతోష్, డోలి సుధీర్, భాస్కర్, నాగేష్, తదితరులు పాల్గొన్నారు.