అమ్మ బైలెళ్లినదో.. తల్లి బైలెళ్లినదో
04-10-2026 | 08:45pm
భిక్కనూర్, అక్టోబర్ 4 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం(Bhikkanur Mandal) పెద్దమల్లారెడ్డి గ్రామంలో అమ్మవారికి గంగాహారతితో(Ganga Harati) ఘనంగా స్వాగతం పలికారు. గ్రామానికి చెందిన హిందూధల్(Hindu Dal) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి రాకను వీక్షించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు, యువత తరలివచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగాహారతి కార్యక్రమంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు, యువత పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.