కరువుపై కవిత గరం
హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, నవంబర్ వరకు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని కోరారు. కరువు మండలాలను వెంటనే ప్రకటించి కేంద్రం నుంచి సహాయం పొందేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కవిత కోరారు. అలాగే దేశంలో ఈవీఎంల స్థానంలో పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.