‘కంగ్రాజులేషన్స్ రేవంత్’.. అసలేంటి కథ?

04-10-2026 | 09:11am

సికింద్రాబాద్‌లో ఒక్కసారిగా భారీ బ్యానర్లు (Banners) దర్శనమివ్వడం స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. మెడికవర్ ఆస్పత్రి (Medicover Hospital) సమీపంలో రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన భారీ బ్యానర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.“కంగ్రాజులేషన్స్ రేవంత్ రెడ్డి గారు.. రూ.13,200 కోట్లు” అంటూ బ్యానర్లపై కనిపిస్తున్న సందేశం (Message) ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారీ అక్షరాలతో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లను చూసేందుకు అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.

అయితే ఈ బ్యానర్లు ఎవరు ఏర్పాటు చేశారు? రూ.13,200 కోట్ల ప్రస్తావన (₹13,200 Crore) దేనికి సంబంధించినది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు (Congratulations) తెలుపుతూ ఈ భారీ బ్యానర్లు ఎందుకు వెలిశాయి? అనే అంశాలపై స్థానికంగా చర్చ జరుగుతోంది.సికింద్రాబాద్ ప్రధాన రహదారిపై భారీగా ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లు ప్రస్తుతం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా మారాయి. బ్యానర్ల వెనుక ఉన్న అసలు కారణం (Reason) ఏమిటన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు