చరిత్రలోనే అత్యంత అవినీతిమయమైన యూపీఏ కాంగ్రెస్ పాలన..
బీజేపీది అవినీతికి దావులేని పాలన..
ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే స్థితిలో లేరు..
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రచ్చ శ్రీనివాస్..
యాదగిరిగుట్ట, అక్టోబర్ 4 (విజయక్రాంతి): గత కాంగ్రెస్, యూపీఏ పదేళ్ల పాలన దేశ చరిత్రలోనే అత్యంత అవినీతిమయమైన పాలన అని ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే స్థితిలో లేరని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ అవినీతి లేని పాలన అందిస్తుందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రచ్చ శ్రీనివాస్(BJP State Council member Racha Srinivas) అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పంచభూతాలను సైతం వదలకుండా ప్రతి రంగంలో లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాంగ్రెస్ నేతలు లూటీ చేశారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలతో ప్రజలు విసుగుచెంది కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 నుండి ఇప్పటివరకు అవినీతికి తావులేకుండా పాలన సాగుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జన్ ధన్, ఆధార్, మొబైల్ జేఏఎం త్రయం ద్వారా లక్షల కోట్ల రూపాయల సంక్షేమ నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్తున్నాయని గతంలో ఉన్న దళారీ వ్యవస్థను మోదీ సర్కారు పూర్తిగా సమాధి చేసిందిని,
పీఎం కిసాన్, ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల గ్యాస్, పక్కా గృహాల నిర్మాణం వంటి పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజాధనం సద్వినియోగం అవుతుండటాన్ని చూసి జీర్ణించుకోలేకనే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మోదీపై విషం చిమ్ముతున్నాయని ఆయన విజ్ఞులు అయిన ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని అన్నారు.