ఓం చాముండేశ్వరి ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే
నాయిని, చైర్మన్ గుండు సుధారాణి
హనుమకొండ, అక్టోబర్ 04(విజయ క్రాంతి): వరంగల్‌లో(Warangal) దసరా, దీపావళి పండుగలను(Dussehra and Diwali festivals) పురస్కరించుకొని హంటర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Naini Rajender Reddy), కుడా చైర్మన్ గుండు సుధారాణి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నిర్వాహకులు ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో ప్రజలను ఆకర్షించేలా, వారికి ఉపయోగపడేలా ఎగ్జిబిషన్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఇతర ప్రాంతాలకు వెళ్లి చూడలేని ప్రముఖ దేవాలయాలు, ప్రత్యేక నిర్మాణాలు, వివిధ ప్రదర్శనలు, వినూత్న కార్యక్రమాలను వరంగల్‌లోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు.ఈసారి కూడా ఎగ్జిబిషన్‌ను ఎంతో చక్కగా, ఆకర్షణీయంగా మిరియాల వేణు, శ్రీకాంత్, వరుణ్, గోపి, ఫిరోజ్ రూపొందించారని ఎమ్మెల్యే ప్రశంసించారు.
ప్రజలకు ఆహ్లాదంతో పాటు ప్రత్యేక అనుభూతిని అందించేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, ఎగ్జిబిషన్ విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకలో మాజీ కార్పొరేటర్లు మామిండ్ల రాజు,వేల్పుల మోహన్ రావు,డివిజన్ అధ్యక్షులు సత్తు రమేష్,మాజీ అధ్యక్షులు సురేందర్,నాయకులు సురేష్,వరుణ్, వేణు మరియు నిర్వాహకులు శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.