యువత సైబర్ నేరాల పట్ల అవగాహన

28-10-2026 | 08:42pm

నేరేడుచర్ల ఎస్సై సిహెచ్ గోపాల్ రెడ్డి

నేరేడుచర్ల,(విజయక్రాంతి): ప్రస్తుత సమాజంలో యువత, మహిళలు, విద్యార్థులు సైబర్ మోసాల(Cyber Crimes) పట్ల అవగాహనతో పాటు అప్రమత్తత కలిగి ఉండటం వల్ల నేరాలని అరికట్టవచ్చని నేరేడుచర్ల ఎస్ఐ సిహెచ్ గోపాల్ రెడ్డి(Nereducherla SI CH Gopal Reddy) అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

 ఆయన మాట్లాడుతూ.... సెల్ ఫోన్లు వినియోగంలో వ్యక్తిగత గొప్యత పాటించాలని, అనవసరమైన సమాచారము, వ్యక్తిగత ఫోటోలు వేరే వారితో పంచుకోవడం వల్ల జరిగే అనర్దాలను వివరించారు. మహిళలు, విద్యారినులు అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్ లకు,ఆకాతాయి  వేధింపులకు గురైతే 1945 కి కాల్ చేయాలన్నారు. సోషల్ మీడియా యాప్సులలో ప్రొఫైల్ సెట్టింగ్స్ ని సెక్యూరిటీ లాక్ చేసుకోవడం వల్ల వ్యక్తిగత సమాచారం గొప్యంగా ఉంచుకోవచ్చు.

యువత విద్యార్థులు మాదకద్రవ్యాలకి దూరంగా ఉండాలని, క్షణకాలం ఆనందం కోసము జీవితాలను నాశనం చేసుకోవద్దు అన్నారు. మైనర్ డ్రైవింగ్,రాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం ద్వారా జరిగే ప్రమాదాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కొణతం సీతారాoరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి,వి.చారి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు